తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కామెడీ స్టార్స్ !

తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కామెడీ స్టార్స్ !

Published on Sep 6, 2018 11:42 PM IST

Silly

వరుస విజయాల నుంచి వరస పరాజయాలతో అల్లరి నరేష్ గత కొంతకాలంగా సతమతవుతున్నాడు. కాగా తాజాగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ తో కలిసి చేసిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్రం పై నరేష్ మరియు సునీల్ చాలానే హోప్స్ పెట్టుకున్నారు. తొట్టి గ్యాంగ్ చిత్రం తర్వాత మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో.. ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ చిత్రం గాని విజయం సాధిస్తే.. కెరీర్ లో కాస్త వెనుక పడ్డ అల్లరి నరేష్ గత వైభవానికి ఈ చిత్రం బీజం వేసినట్లే. అలాగే ప్లాప్ ల కారణంగా దాదాపు హీరో వేషాలు మానుకున్న సునీల్ కెరీర్ కూడా ఈ చిత్రం విజయం చాలా కీలకం కానుంది. అయితే తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని సిట్యుయేషన్ ఫన్ తో పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించారట. ముఖ్యంగా నరేష్ పాత్ర, సునీల్ పాత్రను ఇరికించే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని తెలుస్తోంది. కాగా అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా పూజా ఝావేరి నటిస్తోంది. పూజా గతంలో విజయ్ దేవరకొండ సరసన ద్వారకా చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు