ఎట్టకేలకు చాలా వాయిదాల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ‘అదుగో’ చిత్రం విడుదల అవ్వడానికి సన్నద్ధం అయింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘అదుగో’ వస్తుండటంతో ఈ చిత్రం భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్స్ కారణాల వల్ల.. విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.
కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. హే బంటీ.. హే బంటీ.. అంటూ ఫ్రేమ్ లోకి పందిపిల్ల రాకతో మొదలైన టీజర్, ఫైనల్ గా బంటీ (పందిపిల్ల) డాన్స్ విన్యాసాలతో ముగుస్తోంది. కాగా టీజర్ ఆకట్టుకున్నే విధంగా ఉందని ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైవ్ యాక్షన్ త్రీడీ సాంకేతికతో రోపొందిన ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ కానుంది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


