ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, గతంలో ఎప్పుడు లేని విధంగా, సీనియర్ హీరోలతో పాటు చరణ్ అండ్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ లు కూడా కలిసి నటిస్తుండటం విశేషం. ఇప్పటికే వీరి కాంబినేషన్ కి రాజమౌళి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు తెరెకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువుగా వినిపిస్తోన్న పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వరుణ్ తేజ్ తో F2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే తన మేనల్లుడు నాగ చైతన్యతో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న వెంకీ, నెక్స్ట్ మరో మల్టీస్టారర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ తో నటించడానికి వెంకీ ఒప్పుకున్నట్లు. కాగా ఈ కాంబినేషన్ దాదాపు ఖాయం అయ్యేటట్లుగానే కనిపిస్తోంది. మహానటి సినిమాలో జెమిని గణేషన్ గా కనిపించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.


