ఇది ఓ ఇండియన్ ఫసక్ – మంచు మనోజ్
Published on Sep 11, 2018 3:38 pm IST

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న హీరోల్లో.. ఎవరు ముందు వరుసలో నిలుస్తారంటే.. మంచు మనోజ్ పేరే ముందు చెప్పుకోవాలి. ఇటీవలే జరిగిన ఓ విషాదకర సంఘటన సమయంలో మంచు మనోజ్ స్పందించిన విధానం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. దానికి తోడు ఆయన బాగా యాక్టివ్ గా తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతూ వారి మనసును గెలుచుకుంటున్నాడు. అయితే కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నా.. చాలా స్ఫోటివ్ గా తీసుకుని, ఏమాత్రం విసుగు లేకుండా.. సరదాగా సమాధానమిస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు.

కాగా తాజాగా మనోజ్ ఓ వీడియోను పోస్ట్ చేసారు, ఇప్పుడు అది అందర్నీ కడుపొబ్బా నవ్విస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి నూడిల్స్‌ ను కత్తెరతో కట్ చేసుకొని తింటున్న విధానం ఆకట్టుకుంటుంది. ఆ వీడియోకు మనోజ్ క్యాప్షన్ ఇస్తూ ‘‘ఇప్పుడు నూడిల్స్ ప్రాబ్లమ్. ఇది ఓ ఇండియన్ ఫసక్. ఓ పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయింది’ అని ట్వీట్‌ చేశారు. నెటిజన్లు ఈ వీడియోని బాగా షేర్ చేస్తూ లైక్ చేస్తుండటం విశేషం.

  • 13
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook