మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అరవింద సమేత కోసం తన మేకింగ్ స్టైల్ ను, తన రైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చికొని పని చేస్తుండగా, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా పూర్తి యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం నుండి ‘అనగనగా’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.
కాగా సాంగ్ పూజా హెగ్డే మరియు ఎన్టీఆర్ పై మొదలయింది. పూజా ఎన్టీఆర్ ని ఉద్దేశించి.. ‘టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్వాలేదు’ అంటుండగా, ఎన్టీఆర్ సిగ్గు పడతుంటాడు. ఆ తర్వాత లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. మొత్తానికి సాంగ్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు, సామాన్య ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా, నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. జగపతిబాబు నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


