అరవింద సమేత ట్రైలర్ రెడీ !

అరవింద సమేత ట్రైలర్ రెడీ !

Published on Sep 29, 2018 4:00 AM IST

aravinda sametha

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్ద మవుతుంది. తారక్ అభిమానులు ఈ చిత్రం యొక్క ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు తెర పడనుంది. ఈచిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈట్రైలర్ కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని సమాచారం.

త్రివిక్రమ్ ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశాడని ఈ ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అక్టోబర్ 2న హైదరాబాద్లో సాయంత్రం 6గంటలకు జరుగనుంది. అదే రోజు ఈ ట్రైలర్ ను విడుదలచేసే అవకాశం వుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరుకానున్నారట. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈచిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు