‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం తెలుగులో ఎంతటి సంచలనాత్మక విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. కేవలం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తే.. ఈ చిత్రం దాదాపు పదిహేను కోట్లు పైగానే కలెక్ట్ చేసింది. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ ను తీసుకొని. అక్కడ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ రీమేక్ తోనే ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి హిందీ వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి.
తాజాగా ఆహాన్ శెట్టి ఈ ‘ఆర్ ఎక్స్ 100’ రీమేక్ లో .. హీరోగా నటించడానికి ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించాడట. అయితే ఆహాన్ కు ఇప్పుడు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ వైల్డ్ లవ్ స్టోరీలో ఎలా నటిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ హిందీ ‘ఆర్ ఎక్స్ 100’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కాస్ట్ అండ్ క్రూ ని ఎంపిక చేసి షూట్ కి వెళ్లనున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం తెలుగులో లాగే, హిందీలో కూడా భారీ విజయం సాధిస్తుందేమో చూడాలి.


