విజయ్ ఆ సినిమాలో సీఎం కాదట !

విజయ్ ఆ సినిమాలో సీఎం కాదట !

Published on Oct 3, 2018 3:47 PM IST

vijay3

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సీఎం పాత్ర లో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక నిన్న జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు విజయ్. తాను ఈచిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించడం లేదని ఆయన అన్నారు.

ఇక నిజవితంలో విజయ్ పాత్ర ఎలావుంటుందో ఈ చిత్రంలోను ఆయన పాత్ర అలాగే ఉంటుందని చిత్ర దర్శకుడు మురుగదాస్ అన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు