‘కల్కి సీక్వల్’ కోసం మరో కొత్త పాత్ర ?

‘కల్కి సీక్వల్’ కోసం మరో కొత్త పాత్ర ?

Published on Mar 30, 2026 7:59 AM IST

Kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. లాస్ట్ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రల పై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఐతే, ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ మరో కొత్త పాత్రను తీసుకున్నారని.. ప్రభాస్ పాత్రతో పాటు సినిమాలో ఈ స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని.. ఇది నెగిటివ్ పాత్ర అని, ఈ నెగిటివ్ పాత్రలో మరో బాలీవుడ్ నటుడు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.

తాజా వార్తలు