శర్వానంద్ కోసం ట్రై చేస్తోన్న హిట్ డైరెక్టర్ !

శర్వానంద్ కోసం ట్రై చేస్తోన్న హిట్ డైరెక్టర్ !

Published on Oct 3, 2018 4:22 PM IST

RS Naidu

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. తొలి చిత్రం అయినప్పటికి దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు సినిమాని చాలా చక్కగా తెరకేక్కించాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడుకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ తమ బ్యానర్ లో ఓ సినిమా చెయ్యమని ఆర్ ఎస్ నాయుడుకి అడ్వాన్స్ ఇచ్చారట. సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా నాయుడుతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడు మాత్రం తన తర్వాత సినిమాని హీరో శర్వానంద్ తో చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పటికే శర్వాకి ఓ లైన్ కూడా వినిపించారట. ప్రస్తుతం మూడు సినిమాలకి కమిట్ అయిన శర్వానంద్, ఆర్ ఎస్ నాయుడుకి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

తాజా వార్తలు