
నూతన దర్శకుడు మహేష్ రెడ్డి దర్శకత్వంలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా ‘హవా’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రానా చేతుల మీదుగా విడుదల చేసిన మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్ ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అయితే ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ.
ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చేలా ఉందని ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు. ఇక మధుర శ్రీధర్ విడుదల చేస్తోన్న ఈ సినిమా గురించి చిత్ర ప్రముఖులు ఏం చెప్పారనేది వారి మాటల్లోనే చూద్దాం..
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. న్యూ టాలెంట్ అంతా కొత్త ఐడియాస్, కథలతో వస్తోంది. వీళ్ల వల్ల మేం కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి వస్తోంది. మధుర శ్రీధర్ గారు ఎప్పుడూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..
నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. మహేష్ రాజు కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. నేను సినిమాను చూశాను. చాలా బావుంది. యాక్షన్ పార్ట్ తో పాటు మంచి కామెడీ ఉంది. ఆర్టిస్ట్ లంతా బాగా చేశారు. ఆల్రెడీ హిందీలో మంచి రేట్ కు శాటిలైట్ అమ్మేశారు. ఇది మంచి బిగినెంగ్ టుదిస్ మూవీ. నవంబర్ 23న విడుదల చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికీ మంచి ఫ్యూచర్ ఉందని అన్నారు.
‘హవా’ దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పను. మీరు ట్రైలర్ చూశారు. 23న సినిమా విడుదల కాబోతోంది. అప్పుడే సినిమా ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని, సంగీతం : గిఫ్టన్ ఎలియాస్, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాణం : ఫిల్మ్
అండ్ రీల్ , దర్శకత్వం : మహేష్ రెడ్డి.

