మెగా హీరోకు జోడిగా సవ్యసాచి హీరోయిన్ !

మెగా హీరోకు జోడిగా సవ్యసాచి హీరోయిన్ !

Published on Nov 5, 2018 2:13 PM IST

Nidhhi Agerwal1

మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నాడని తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో ‘సవ్యసాచి’ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్ , వైష్ణవ్ కు జోడిగా నటించనుంది.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇక వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం నటన కు సంభందించిన శిక్షణ తీసుకుంటున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు