‘అభిమన్యుడు’ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది !

‘అభిమన్యుడు’ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది !

Published on Nov 5, 2018 7:29 PM IST

Abhimanyudu

సూపర్ హిట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘అభిమన్యుడు’ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాకపోతే ఈ సారి హీరో విశాల్ కాదు. తమిళ హీరో శివ కార్తికేయన్, ‘అభిమన్యుడు’ చిత్ర దర్శుకుడు మిత్రన్ తో ఒక సినిమా కు కమిట్ అయ్యాడు. తన మొదటి చిత్రం తోనే మంచి విజయాన్ని సాధించిన ఈ దర్శకుడు తన రెండో చిత్రాన్నికూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గానే తెరకెక్కించనున్నాడు . ఈచిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

24ఏఎమ్ స్టూడియోస్ పతాకం ఫై ఆర్ డి రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది శివ కార్తికేయన్ కు 15వ చిత్రం కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు