కేరళలో బన్నీ కి ఘన స్వాగతం !

కేరళలో బన్నీ కి ఘన స్వాగతం !

Published on Nov 10, 2018 12:47 PM IST

bunny
కేరళ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ ఈ రోజు జరిగే 66వ నెహ్రు ట్రోఫీ బోట్ రేసులకు ముఖ్య అతిధిగా హాజరైయేందుకు కొచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అల్ల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు కేరళ అభిమానులు. ఆయన వస్తున్నాడు అని తెలుసుకొని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

ఇక అల్లు అర్జున్ ను అక్కడ అందరూ మల్లు అర్జున్ అని పిలిచుకుంటారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు తో పాటు మలయాళం లోను విడుదలవుతుంటాయి. దాంతో బన్నీ అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు