సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న25వచిత్రం ‘మహర్షి’ యొక్క యూఎస్ షెడ్యూల్ ను ముగించుకొని ఇటీవల చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకొంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్లోని ప్రముఖ స్టూడియోలో వేసిన విలేజ్ సెట్ లో జరగనుంది. దాదాపుగా 25 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో మహేష్ , అల్లరి నరేష్ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత డిసెంబర్ లో పాటల చిత్రీకరణ ను జరుపనున్నారు దాంతో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది.
వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.


