మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా రామ్ చరణ్ కి చిన్నపాటి గాయం కావడం అభిమానుల్ని కొంచెం కలవర పెట్టింది.
దీనితో చరణ్ బాబాయ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పందన అందించగా అది అభిమానుల్లో వైరల్ గా మారింది. “అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని పవన్ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ అభిమానుల్లో కొంత ధైర్యాన్ని అందించి వారిలో వైరల్ గా మారింది.
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి
అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
– @PawanKalyan@AlwaysRamCharan @PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2026


