యూత్ : చివరి నిమిషంలో రిలీజ్ డేట్ వాయిదా.. కొత్త డేట్ ఇదే..!

యూత్ : చివరి నిమిషంలో రిలీజ్ డేట్ వాయిదా.. కొత్త డేట్ ఇదే..!

Published on Mar 25, 2026 3:01 PM IST

Youth 1

తమిళంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ చిత్రం ‘యూత్’(Youth) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. కెన్ కరుణాస్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది. తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, రిలీజ్‌క మరికొద్ది గంటలు మాత్రమే ఉన్న తరుణంలో మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఓ బాంబ్ పేల్చారు.

‘యూత్’ చిత్ర రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. మార్చి 26న కాకుండా మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేగాక ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్‌కు సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో దేవదర్శిణి, సూరజ్ వెంజరమూడు, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు