టీజర్ తో వచ్చిన ‘నేను లేను’ !

టీజర్ తో వచ్చిన ‘నేను లేను’ !

Published on Nov 12, 2018 11:08 AM IST

Nenu Lenu
ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ దర్శకత్వంలో ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో హ‌ర్షిత్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన చిత్రం నేను లేను . చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది‌. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుః జోజో, సహ నిర్మాత : యాషిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన – దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె.

టీజర్ కోసం క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు