యాంకర్ గా మారనున్న రామ్ గోపాల్ వర్మ !

యాంకర్ గా మారనున్న రామ్ గోపాల్ వర్మ !

Published on Nov 23, 2018 3:04 PM IST

BhairavaGeetha

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సారి గా యాంకర్ గా మారనున్నారు. ఆయన సమర్పణలో వస్తున్న ‘భైరవ గీత’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హై లైఫ్ లో జరుగనుంది. ఈఈవెంట్ కి వర్మ యాంకరింగ్ చేయనున్నారు.

నూతన దర్శకుడు సిద్ధార్థ తెరకెక్కించిన ఈచిత్రంలో కన్నడ నటుడు ధనంజయ , ఇర్ర మోర్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాయలసీమ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ, భాస్కర్ రాశి సంయుక్తంగా నిర్మించారు. ఇక విజువల్ వండర్ ‘2.0’ చిత్రం కంటే ఒక్క రోజు ఆలస్యంగా నవంబర్ 30న విడుదలవుతున్న ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద ఎంత మేరకు కలక్షన్ల ను రాబడుతుందో చూడాలి.

తాజా వార్తలు