‘డ్రాగన్’ షూట్, రిలీజ్ లపై మేకర్స్ సాలిడ్ క్లారిటీ!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్ లపై మేకర్స్ సాలిడ్ క్లారిటీ!

Published on Sep 3, 2026 2:00 AM IST

ప్రస్తుతం తెలుగు సినిమా నుంచి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ సినిమా డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే. షూట్ లో తారక్ కి జరిగిన చిన్నపాటి గాయం కారణంగా తారక్ షూట్ కి బ్రేక్ పడింది.

ఇక షూట్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనేది మైత్రి మూవీ మేకర్స్ రివీల్ చేసారు. మరో రెండు వారాల్లో డ్రాగన్ పునః ప్రారంభం కానుందట. అలాగే సినిమా షూట్ అంతా ఫిబ్రవరికి పూర్తి చేసేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అనుకున్న సమయానికి సినిమా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసేసారు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే రుక్మిణి వసంత్, అనీల్ కపూర్ తదితరులు సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు