‘నిన్ను తలచి’ ఫస్ట్ లుక్ విడుదల !

‘నిన్ను తలచి’ ఫస్ట్ లుక్ విడుదల !

Published on Jan 7, 2019 8:50 AM IST

ninnu talachi
వంశీ, స్టెఫీ పాటెల్ హీరో, హీరోయిన్లు గా అనిల్ తోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో..

నిర్మాత అజిత్ మాట్లాడుతూ కొత్త బ్యానర్ తో పాటు కొత్త హీరో హీరోయిన్లతో కలిసి చేస్తున్న సినిమా. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

హీరోయిన్ స్టెఫీ పటేల్ మాట్లాడుతూ టాలీవుడ్ లో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆడాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సినిమా చేసాం. ఈ సినిమాకు అవకాశం కల్పించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రం కూడా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరి లో సినిమా ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

హీరో వంశీ మాట్లాడుతూ ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ నాకి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాను మీరందరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

తాజా వార్తలు