‘పెద్ది’ స్పెషల్ సాంగ్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్!

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Mar 22, 2026 8:01 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే పెద్ది. ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. లేటెస్ట్ గా ఓ ఐటమ్ సాంగ్ కోసం క్రేజీ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తూ వస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది అని తెలిసిందే.

అయితే ఇదే సాంగ్ పై మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మొత్తం ముగ్గురి కొరియోగ్రఫీ ఈ సాంగ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఏది బాగుంది అనిపిస్తే దానిని ఫైనల్ చేసి తెరకెక్కించనున్నారట. సో పెద్ది స్పెషల్ సాంగ్ కోసం మాత్రం మరింత స్పెషల్ ప్లానింగ్ లు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు