మన టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “బైకర్”. ఇండియన్ సినిమా నుంచి మొట్ట మొదటి మోటో క్రాస్ సినిమాగా వస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని వదిలారు. ఇక ఈ ట్రైలర్ మాత్రం మంచి రేసింగ్ డ్రామాలని ఇష్టపడే వారికి మాములు ఫీస్ట్ ఇచ్చేలా లేదని చెప్పాల్సిందే. ఆ మధ్య వచ్చిన టీజర్ తోనే మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇప్పుడు వదిలిన ట్రైలర్ మాత్రం అంతకు మించి ఉంది అని చెప్పాల్సిందే. డెఫినెట్ గా ఈ ట్రైలర్ లో విజువల్స్ ఇంత లెవెల్లో వరల్డ్ క్లాస్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని దాదాపు ఎవరూ ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ సినిమాని ప్రెజెంట్ చేసారని చెప్పాలి. ఇక రేస్ ట్రాక్ పై ప్రతీ షాట్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంటే దీనితోనే నటుడు రాజశేఖర్ పై ఎమోషనల్ ట్రాక్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.
ఇలా కేవలం స్పోర్ట్ తో పాటుగా అదే సమయంలో సాలిడ్ ఎమోషన్స్ కూడా ఇందులో కనిపించేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఇందులో శర్వానంద్ డెడికేషన్ కూడా గట్టిగానే కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో కెమెరా వర్క్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూడ్ ని మైంటైన్ చేస్తూ ఒక థ్రిల్లింగ్ రైడ్ ని ప్రామిస్ చేస్తున్నాయి. ఇలా మొత్తానికి మాత్రం యూవీ మేకర్స్ ఈ ఏప్రిల్ 3న థియేటర్స్ లో సాలిడ్ ట్రీట్ ని అందించనున్నారని చెప్పాలి.


