గల్లీబాయ్ ట్రైలర్ విడుదలకానుంది !

గల్లీబాయ్ ట్రైలర్ విడుదలకానుంది !

Published on Jan 8, 2019 12:22 AM IST

gally2

ఇటీవల ‘సింబా’ చిత్రం తోప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు యువ హీరో రణ్వీర్ సింగ్. తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 300కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత రణ్వీర్ ప్రస్తుతం గల్లీ బాయ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదలకానుంది.

జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ కథానాయికగా నటిస్తుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీ గా విడుదలవుతున్న ఈచిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు