నా గర్వమే నా అవకాశాలను పోగొట్టాయి – నమిత

నా గర్వమే నా అవకాశాలను పోగొట్టాయి – నమిత

Published on Aug 31, 2026 7:01 AM IST

సీనియర్ హీరోయిన్‌ నమిత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఇంతకీ నమిత ఏం మాట్లాడింది అంటే.. ‘హీరోయిన్ గా నేను కెరీర్‌ను ప్రారంభించిన తొలిరోజులు అవి, సహజంగా ఆ వయసులో ఎవరికైనా పెద్దగా అవగాహన ఉండదు. ఎలా ఉండాలి ?, ఎలా బిహేవ్ చేయాలి ? అనే విషయాల్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. నేను అలాగే చేశాను. దానికితోడు ఆ రోజుల్లో నాకు గర్వం ఉండేది. ముఖ్యంగా ఎదుటివారిని లెక్క చేసేదాన్ని కాదు’ అని నమిత తెలిపింది.

నమిత ఇదే విషయం పై ఇంకా మాట్లాడుతూ.. ‘నా గర్వం కారణంగా ఆ సమయంలో నేను చాలా కోల్పోయాను. అప్పుడు కొందరు నాకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘నువ్వు ఇలా ఉంటే.. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండవు’ అని చెప్పారు. అయినా అప్పుడు నాకు ఆ విషయం అర్ధం కాలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చి వెళ్లిపోయాయి. సినిమాలు తగ్గాక నాకు నేను చేసిన తప్పు అర్ధం అయింది’ అని నమిత చెప్పింది. తెలుగులో ‘సొంతం’ సినిమాతో వెండితెరకు నమిత పరిచయమైంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు