భారతీయుడు 2 లో సౌత్ కొరియన్ నటి !

భారతీయుడు 2 లో సౌత్ కొరియన్ నటి !

Published on Jan 10, 2019 9:00 AM IST

Bae Suzy

లోక నాయకుడు కమల్ హాసన్ – శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈనెల 18నుండి వచ్చే ఏడాది జనవరిలో చెన్నైలో జరగనుంది. ఈ షెడ్యూల్ తరువాత పొల్లాచ్చి , ఆంధ్రప్రేదేశ్ , తైవాన్ ,ఉక్రెయిన్ లలో ఈచిత్రం యొక్క మిగితా చిత్రీకరణ జరుగనుంది. ఇక ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటి సుజి బే ముఖ్య పాత్రలో నటించనుందని సమాచారం.

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

తాజా వార్తలు