తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితకథ ఆధారంగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ జయలలిత బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసందే. జయలలిత జీవితాన్ని మొత్తం 32 ఎపిసోడ్స్ ఉండేలా రూపొందించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన గౌతమ్ త్వరలోనే షూట్ కి వెళ్లనున్నారు.
ఇక జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. జయలలితగారి లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే రమ్యకృష్ణ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు రమ్యకృష్ణను నటింపజేస్తున్నారట. మొత్తానికి జయలలిత కోసం రమ్యకృష్ణ షూట్ కి వెళ్లనుంది.
అయితే ఇప్పటికే ఏఎల్ విజయ్, ప్రియదర్శిని, భారతాయి రాజా ఇలా పలువురు దర్శకులు జయలలితగారి జీవితకథ ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. మరి వీరి సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.


