100 కోట్ల క్లబ్ లో చేరిన ఎఫ్ 2 !

100 కోట్ల క్లబ్ లో చేరిన ఎఫ్ 2 !

Published on Jan 25, 2019 9:00 AM IST

F22

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 రేర్ ఫీట్ ను సాధించింది. మల్టీ స్టారర్ చిత్రాల్లో 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈచిత్రం. అలాగే ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచి మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల ఫై చిలుకు షేర్ ను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 13రోజుల్లోనే 68 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈచిత్రం దిల్ రాజుకు ఊహించని విజయాన్ని అందించింది. ఈ సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ కావడంతో అనిల్ ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ అనే సినిమా ను తెరకెక్కించనున్నాడు. వెంకీ , వరుణ్ తోపాటు ఈ సీక్వెల్ లో మరో స్టార్ హీరో కూడా జాయిన్ కానున్నాడు.

తాజా వార్తలు