గత ఏడాది కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన చిత్రం 96. విమర్శకుల ప్రశంసల తోపాటు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఇక ఈచిత్ర ఆడియో కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. శర్వానంద్ ,విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో నటిచనుండగా త్రిష చేసిన పాత్రలో సమంత నటించనుంది. ఇక ఈ రీమేక్ కు కూడా గోవింద్ వసంత నే సంగీతం అందించనున్నాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటిసినిమా.
ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన ప్రేమ కుమారే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా దిల్ రాజు నిర్మించనున్నారు. మరి ఈ చిత్రంతో ప్రేమ్ కుమార్ , గోవింద్ వసంత తెలుగులో బిజీ అవుతారో లేదో చూడాలి.


