విడుదలకు ముందు పలు వివాదాలతో తరుచూ వార్తల్లో నిలిచింది మణికర్ణిక చిత్రం. ఈచిత్ర దర్శకత్వ బాధ్యతలనుండి క్రిష్ మధ్యలోనే తప్పుకోవడం అలాగే నటుడు సోను సూద్ కూడా కంగనా రనౌత్ సెట్ లో తనను అవమానించిందని సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. ఇక ఆ తరువాత మిగిలిన షూటింగ్ కి కంగానా నే దర్శకత్వం చేసి సినిమా ను ఎలాగోలా పూర్తి చేసింది.
ఇక ఈనెల 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకోలేకపోయింది కానీ నిన్న మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక అంతా ఓకే అనుకున్న సమయంలో చిత్రానికి పైరసీ రూపంలో దెబ్బ పడింది. ఈచిత్రాన్ని కొందరు ఆన్లైన్ లో లీక్ చేశారు. ఈచిత్రం తోపాటు మరో బాలీవుడ్ మూవీ యూరి ని కూడా లీక్ చేశారు. మరి ఈ పైరసీ ని తట్టుకొని మణికర్ణిక ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.


