‘సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్’ కోసం ఉపాసన కొణిదెల సహకారం !

‘సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్’ కోసం ఉపాసన కొణిదెల సహకారం !

Published on Jan 27, 2019 8:00 PM IST

Upasana

ఉపాసన కామినేని కొణిదెల ‘ సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్’ అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహకారంతో హైదరాబాద్ నుండి రాజస్థాన్ కు వెళ్లారు. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు. నిన్న రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్ కి వారు వెళ్లారు..

కాగా హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్,వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు.. శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు