కంగనా ఫై కంప్లైట్స్ ఆగడం లేదు !

కంగనా ఫై కంప్లైట్స్ ఆగడం లేదు !

Published on Jan 30, 2019 4:29 PM IST

kangana1

‘మణికర్ణిక’ విడుదల ముందు వివాదాలతో తరుచూ వార్తల్లో నిలిచింది ఈ చిత్రం. ఇక ఎట్టకేలకు సినిమా విడుదలై అంతా ఒకే అనుకున్న తరుణంలో చిత్ర యూనిట్ లో ఒక్కొక్కరుగా కంగనా ఫై విమర్శలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా దర్శకుడు క్రిష్ సినిమా షూటింగ్ సమయంలో కంగాన తన పట్ల ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. ఈ విషయంలో క్రిష్ కే ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా నటి ‘చిన్నదాన నీకోసం’ ఫేమ్ మిష్టి చక్రవర్తి కూడా కంగనా ఫై ఆరోపణలు చేసింది. ఈచిత్రంలో మిష్టి సహాయక పాత్రలో నటించింది. ఇక తాజాగా సినిమా చూసిన ఆమె తన పాత్ర ను కంగనా చాలా తగ్గించిందని అన్నారు. క్రిష్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆయన దర్శకత్వంలో పని చేయాలని అనుకునేదాన్ని లక్కీ గా మణికర్ణికలో ఛాన్స్ వచ్చింది. క్రిష్ నా పాత్ర కు ఇచ్చిన నిడివి పాధాన్యత సినిమా లో కనిపించలేదు అలాగని కంగనా ను తప్పుబట్టడం లేదు అని ఆమె అన్నారు.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతుంది. ఇప్పటివరకు ఈచిత్రం ఇండియాలో 50కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

తాజా వార్తలు