నాని 24 కు కూడా 24 ను ఫాలోవుతున్న విక్రమ్ కుమార్ !

నాని 24 కు కూడా 24 ను ఫాలోవుతున్న విక్రమ్ కుమార్ !

Published on Feb 3, 2019 5:14 PM IST

Nani Vikram

‘మనం, 24′ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ తో నాని తన 24వ చిత్రాన్ని చేయనున్నాడు. ఆల్రెడీ నాని జెర్సీ చిత్రాన్ని పూర్తి చేసి ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో నాని మూడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడు. అందులో యువకుడిగా ,మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా అలాగే వృద్దుడిగా నటించనున్నారు. ఇక ఇంతుకుముందు సూర్య ను ’24’ లో యువకుడిగా , వృద్దుడిగా చూపించి విజయం సాదించాడు విక్రమ్ కుమార్. మరి ఈ చిత్రం తో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

ఇక ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

తాజా వార్తలు