బాక్సర్ గా వరుణ్ తేజ్ !

బాక్సర్ గా వరుణ్ తేజ్ !

Published on Feb 6, 2019 7:35 PM IST

VarunTej

ఫిదా తరువాత ఎఫ్ 2 తో కెరీర్ లో రెండో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇటీవల విడుదలైన ఈ చచిత్రం వరుణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈచిత్రం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలో నటించనున్నాడు వరుణ్. కోలీవుడ్ హిట్ మూవీ జిగర్తండా కు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఇదిలావుంటే వరుణ్ తన 10వచిత్రాన్ని కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈచిత్రంలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం వరుణ్ లాస్ ఏంజిల్స్ లో బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. సందీప్ ముద్దా , అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజా వార్తలు