విజయ్ కు సోలో డేట్ ఖాయమా..?

విజయ్ కు సోలో డేట్ ఖాయమా..?

Published on Aug 29, 2026 12:21 AM IST

2026 దసరా బరిలో పోటీ ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయి. మొదట్లో ‘జైలర్ 2’, ‘విశ్వంభర’, ‘ఆదర్శ కుటుంబం’ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ యుద్ధం గ్యారెంటీ అనుకున్నారు. కానీ సీజీ పనుల ఆలస్యం వల్ల చిరంజీవి ‘విశ్వంభర’ రేసు నుంచి తప్పుకోగా, రజినీకాంత్ ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ పై కూడా సందిగ్ధత నెలకొంది.

ఈ పరిణామాల మధ్య విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న 19వ శతాబ్దపు పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
​పెళ్లి తర్వాత విజయ్–రష్మిక జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది.

పెద్ద చిత్రాలు తప్పుకుంటే విజయ్ కెరీర్‌కు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్ట్‌కు సోలో లేదా అనుకూలమైన పెద్ద స్పేస్ దొరికే అవకాశం ఉంది. పండగ సెలవలను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ, వరుస ఫ్లాప్‌లకు ‘రణబాలి’ గట్టి బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా వార్తలు