షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన చిత్రబృందం !

షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన చిత్రబృందం !

Published on Feb 7, 2019 3:00 AM IST

nandamuri tarakaratna

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకం పై శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం `అమృత వ‌ర్షిణి`. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తీ చేసుకుంది.

అయితే ప్రస్తుతం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిందట చిత్రబృందం. తాజాగా తారక్ రత్న రెస్టారెంట్ కూల్చిన విషయం తెలిసిందే. ఆ పనులను చక్కదిద్దుకునే పనిలో ఉన్న తారక్ కోసం చిత్రబృందం నాలుగు రోజులు షూట్ కి గ్యాప్ ఇచ్చారట.

ఇక తారక్ రత్నకి ఈ చిత్రం మంచి హిట్ ఇస్తోందని.. ఇది ఇంటెన్స్ ఉన్న స్టోరి.. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది. మరి ఈ చిత్రంతోనైనా తారక్ రత్న హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

తాజా వార్తలు