గత ఏడాది ‘చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యంగ్ హీరో నితిన్ కు ఈ రెండు కూడా విజయాలను అందిచలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘ఛలో’ తో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములతో తన కొత్త చిత్రాన్ని చేయనున్నాడు నితిన్. ఈచిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇక ఈ చిత్రం ఈనెల 25నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించనుడగా ఛలో ఫేమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది.
ఇక నితిన్ ఈచిత్రం తోపాటు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తో కూడా ఒక చిత్రాన్ని చేయనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిచనుంది. తర్వలోనే ఈ ప్రాజెక్ట్ ఫై మరింత క్లారిటీ రానుంది.


