కీర్తి సురేష్ కొత్త చిత్రం షూటింగ్ ఆసల్యం కానుంది !

కీర్తి సురేష్ కొత్త చిత్రం షూటింగ్ ఆసల్యం కానుంది !

Published on Feb 10, 2019 5:06 PM IST

keerthi suresh

మహనటి తరువాత తెలుగులో చాలా గ్యాప్ తోసుకొని ఇటీవలే కొత్త చిత్రానికి సైన్ చేసింది కీర్తి సురేష్. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నరేంద్ర దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రం యొక్క మొదటి రోజు షూటింగ్ ఈనెల 14న ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల వాయిదా పడిందని సమాచారం. ఇంకా కొత్త షూటింగ్ తేదీ ఖరారు కాలేదు.

ఇక ఈచిత్రం యొక్క స్క్రిప్ట్ కీర్తి కి బాగా నచ్చిందట. హైదరాబాద్, కేరళ తోపాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనునున్న ఈ చిత్రానికి మహానటి ఫేమ్ ధని సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించనున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళం లోనూ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు