నయన్ ‘ఐరా’ విడుదలతేదీ ఖరారు !

నయన్ ‘ఐరా’ విడుదలతేదీ ఖరారు !

Published on Feb 20, 2019 12:28 AM IST

Nayanatra

గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ గా వుంది. అందులో ఒకటి ‘ఐరా’ చిత్రం. సర్జున్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ ఫస్ట్ టైం రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ సినిమా ఫై అంచనాలను పెంచింది.

కేజేఆర్ స్టూడియోస్ , ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదలకానుంది. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ మార్చి 28న విడుదలకానుండగా తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు