అడివి శేష్ హీరోగా శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రం గత ఏడాది ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్ళను కూడా రాబట్టింది. కాగా ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది.
పైగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత కావడం విశేషం. కాగా 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్ సంస్థ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనుంది. ఇక ఈ చిత్రానికి ‘మేజర్’ అనే పేరును నిర్ణయించింది చిత్రబృందం.


