ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ “స్టార్ బాయ్” సిద్ధు జొన్నలగడ్డ తన అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించాడు. ప్రముఖ నిర్మాత నాగవంశీ తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిద్ధుతో కొత్త సినిమాను ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 5వ చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రానికి కో-రైటర్‌గా మరియు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్, ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నారు. భారీ బడ్జెట్‌తో కూడిన “ఫాంటసీ ఎంటర్టైనర్”గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఆయన చేతిలో ఇప్పటికే ‘ బ్యాడాస్’ మరియు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నాయి. ఇప్పుడు అనిల్ కుమార్ ప్రాజెక్టు కూడా తోడవడంతో మొత్తం మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కొత్త సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.


