థ్రిల్లర్ సినిమాలో కేరాఫ్ కంచరపాలెం రాజు !

థ్రిల్లర్ సినిమాలో కేరాఫ్ కంచరపాలెం రాజు !

Published on Mar 2, 2019 12:55 PM IST

Raju

గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రసశంసలు పొందింది ‘కేరాఫ్ కంచరపాలెం’. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజు పాత్రా సినిమాకు హైలైట్ ఆయ్యింది. రియాల్టీ కి దగ్గరగా వుండే ఆపాత్రకు ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు.ఇక ఆపాత్రలో నటించిన రాజు ఆ సినిమా తరువాత తాజాగా మరో సినిమాలో అవకాశం సంపాదించారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అక్షర. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

సప్సెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో బి. చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే లో ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు