లేటెస్ట్ గా విడుదల అయ్యిన భారీ పాన్ ఇండియా చిత్రమే ‘టాక్సిక్’. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ ఫెయిరీ టేల్ సినిమా మొదటి రోజే ఊహించని టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇలా పాన్ ఇండియా లెవెల్లో భారీ బుకింగ్స్ తో గ్రాండ్ డే 1 ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రెండో రోజు మాత్రం భారీగా డ్రాప్ అయ్యింది.
బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి ఏకంగా 60 శాతం మేర టికెట్ సేల్స్ తగ్గిపోయాయి. కేవలం రెండో రోజు ఈ చిత్రం 3 లక్షల 70 వేలకి పైగా టికెట్ సేల్స్ మాత్రమే జరుపుకుంది. ఇది వర్కింగ్ డే కదా అనుకుంటే పొరపాటే.. ఇదే వర్కింగ్ డేలో రీజనల్ సినిమా అయినటువంటి మన టాలీవుడ్ చిత్రం ‘ఇరుముడి’ చిత్రానికి 2 లక్షలకి పైగా టికెట్ సేల్స్ జరిగాయి.
అది కూడా తక్కువ స్క్రీన్స్ పడ్డాయి. ఇక డే 2 బుకింగ్స్ ప్రకారం అయితే ఆ పాన్ ఇండియా సినిమా రీజనల్ సినిమా దగ్గర తేలిపోయింది. రెండో రోజు ఇరుముడి చిత్రానికి ఏకంగా 5 లక్షలకి పైగా టికెట్ సేల్స్ జరిగాయి. సో ఈ లెక్కన చూసుకున్నా ఇరుముడి డామినేషన్ నే ఎక్కువ కనిపిస్తుంది. ఇక వీకెండ్ లో రెండు సినిమాల పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.


