సుమంత్ హీరోగా నటించిన డివైన్ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్ను ఆగస్టు 28న మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్లోని ‘పార్క్ హయత్’ హోటల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


