ఈ చిత్రంతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?

ఈ చిత్రంతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?

Published on Mar 2, 2019 6:16 PM IST

Taraka Ratna

నంద‌మూరి కుంటుంబం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘నంద‌మూరి తార‌క‌ర‌త్న‌’ గురించే. ఏకంగా ఏడు సినిమాలకు అగ్రీమెంట్ చేసి మరి తార‌క‌ర‌త్న‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ పదుల సినిమాలు చేసాక కూడా కనీస స్థాయి హీరోగా కూడా తార‌క‌ర‌త్న‌ నిలబడలేకపోయాడు. చివరికీ ఎట్టకేలకూ శివ‌ప్ర‌భు అనే కొత్త దర్శకుడు ద‌ర్శ‌క‌త్వంలో `అమృత వ‌ర్షిణి` అనే ఓ సినిమా చేస్తున్నాడు.

చాందిని క్రియేష‌న్స్ ప‌తాకం పై నాగ‌రాజు నెక్కంటి.. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తీ చేసుకుంది. ఇక చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయితే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఇక ఈ సినిమాలో తార‌క‌ర‌త్న‌ సరసన ‘మేఘ శ్రీ’ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రం కథ మంచి ఇంటెన్సీ ఉన్న స్టోరి అని.. అదే విధంగా అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని.. చెబుతుంది చిత్రబృందం. మరి ఈ చిత్రంతోనైనా తారక్ రత్న హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఈ చిత్రానికి స‌భా కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా సంగీత దర్శకుడు జెస్సీ గిప్ట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు