అర్జున్ సురవరం టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

అర్జున్ సురవరం టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Mar 4, 2019 2:53 AM IST

Arjun Suravaram

టి యెన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదలచేయనున్నారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది.

సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29న గ్రాండ్ గా విడుదలకానుంది. ఇక ఇటీవల కిరాక్ పార్టీ చిత్రం తో పరాజయాన్ని చవి చూసిన నిఖిల్ ఈ చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని కాన్ఫిడెంట్ గా వున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు