మజిలీ లో చైతూ ,సమంత ల పాత్రల పేర్లు రివీల్ !

మజిలీ లో చైతూ ,సమంత ల పాత్రల పేర్లు రివీల్ !

Published on Mar 4, 2019 8:09 PM IST

Majili1

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం’ మజిలీ’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రేమికుల రోజు కానుకగా ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేయగా అనూహ్యమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ, పూర్ణ గా యంగ్ అలాగే మిడిల్ ఏజ్డ్ పాత్రల్లో కనిపించనున్నాడు. కాగా శ్రావణి పాత్రలో సమంత కనిపించనుంది. ఆమె పాత్ర నవ్వుతో పాటు కన్నీరు కూడా తెప్పిస్తుందట. సినిమాకు ఆమె పాత్ర హైలైట్ కానుంది.

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు