యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం నటిగా బిజీ అవుతుంది. క్షణం , రంగస్థలం చిత్రాలు ఆమె కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం కథనం. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఈచిత్రం యొక్క టీజర్ ను మహిళ దినోత్సవం కానుకగా మార్చి 8న విడుదలచేయనున్నారు. రాజేష్ నాదెండ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ధనరాజ్ , శ్రీనివాస్ అవసరాల, రణధీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గాయత్రి ఫిలిమ్స్ , మంత్ర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం సమ్మర్ లో విడుదలకానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.


