థియేటర్స్ లో ఆరా ఆఫ్ ఉస్తాద్ మిస్సింగ్.. కానీ మరోటి ఉంది!

థియేటర్స్ లో ఆరా ఆఫ్ ఉస్తాద్ మిస్సింగ్.. కానీ మరోటి ఉంది!

Published on Mar 19, 2026 1:59 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సీంగ్. ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో దిగి సందడి చేస్తుండగా అభిమానులు హరీష్ శంకర్ ట్రీట్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్లాన్ చేసిన ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ థియేట్రికల్ వెర్షన్ లో ఉండదు అనే కామెంట్స్ కి హరీష్ ఉంటుంది అని తెలిపారు.

కానీ నేడు థియేటర్స్ లో చూస్తే నిజంగానే ఆ సాంగ్ లేదు. కానీ అలాంటిది మరొకటి ఉంది. అది కూడా సినిమా మొత్తం అయ్యాక ఎండ్ టైటిల్స్ లో వేశారు. సాంగ్ కి మరో వెర్షన్ గా కేవలం ట్యూన్ తో మాత్రమే వదిలారు. ఇది కొంచెం సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే థమన్ స్కోర్ అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు