ఆర్ఆర్ఆర్ కోసం ఒక హీరోయిన్ ను ఖరారు చేశారా ?

ఆర్ఆర్ఆర్ కోసం ఒక హీరోయిన్ ను ఖరారు చేశారా ?

Published on Mar 7, 2019 5:27 PM IST

Alia Bhatt

ఎన్టీఆర్ -రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ ను కలకత్తా లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుందని సమాచారం. ఇక ఈసినిమాలో హీరోయిన్లు గా ఎవరని తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అయితే రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖంగా రైజింగ్ హీరోయిన్ అలియా బట్ పేరు వినబడింది. తాజాగా ఆమె ను ఒక హీరోయిన్ గా ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ అలియా ను తీసుకుంటే ఆమె చరణ్ కు జోడిగా నటిస్తుందా లేక ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తుందో తెలియాల్సి వుంది.

దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలకానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు